APPSC |నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ చేశారు. పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గురువారం ఉదయం అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలను సీఎం జగన్‌కు అందజేశారు. నోటిఫికేషన్‌కు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం జగన్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అధికారులు తెలిపారు. గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Read Also:
1. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గైర్హాజరు, హాజరయ్యే పార్టీలు ఏవంటే?
2. సిడ్నీలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం
Follow us on: Google News, Koo, Twitter