సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీ ఘటనపై సీపీఐ నారాయణ సీరియస్

-

CPI Narayana |ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య జరిగిన గొడవపై సీపీఐ నారాయణ స్పందించారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని విమర్శించారు. ఒక చట్టసభలో టీడీపీ ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు మనుషులా..? పశువులా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉందన్నారు.

- Advertisement -

ఆరు, ఏడు తరగతుల వాళ్లకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆక్షేపించారు. అయినా సరే ఓడిపోవడంతో వైసీపీ నేతలు నిరాశలో ఉండిపోయారు. అందుకే వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉందని, ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీపీఐ నారాయణ(CPI Narayana) డిమాండ్ చేశారు.

Read Also: మీరే నా బలం-బలగం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సందేశం

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...