Shanthi Swaroop | తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూత

-

తొలి తరం తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్(Shanthi Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దూరదర్శన్‌లో వార్తలు చదివిన తొలి యాంకర్‌గా ఆయన గుర్తింపు పొందారు. దూరదర్శన్ అంటే వార్తలు… వార్తలు అంటే శాంతిస్వరూప్ అన్నట్లు తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ ఛానల్ ద్వారా ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి పదేళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. 2011లో పదవీ విరమణ పొందారు. శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

తొలి తరం న్యూస్ రీడర్‌గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన శాంతిస్వరూప్ గారి మరణం బాధాకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

దూరదర్శన్ అంటే వార్తలు… వార్తలు అంటే శాంతిస్వరూప్ గారు అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన శాంతి స్వరూప్(Shanthi Swaroop) గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ పేర్కొ్న్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

Read Also: అమ్మకానికి ఓటరు సిద్ధం.. అందుకే ‘బాండ్స్’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...