GVL Narasimha Rao | ఆ కుటుంబానికి సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి

-

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) ఘాటు వివమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి హత్య ఘటన అమానుషం అని మండిపడ్డారు. అక్కను వేధిస్తుండడంతో అడ్డుకున్న ఆ బాలుడ్ని పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం దారుణమన్నారు.

- Advertisement -

వైసీపీ కార్యకర్త(YCP Activist) ఇలాంటి పాశవిక చర్యకు పాల్పడడం చూస్తుంటే ఏ స్థాయిలో రాక్షస మనస్తత్వాన్ని వారిలో నింపారో అర్థమవుతోందని జగన్(CM Jagan) పై నిప్పులు చెరిగారు. ఆ విద్యార్థి కుటుంబానికి సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ చెప్పడం సిగ్గుచేటని జీవీఎల్(GVL Narasimha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also:
1. దమ్ముంటే ప్రొద్దుటూరులో పోటీ చెయ్.. పవన్ కల్యాణ్‌కు MLA సవాల్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...