మాజీ ఎంపీ, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య(Hari Rama Jogaiah) మరో లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలన పోవాలి… పవన్ సుపరిపాలన రావాలని ఆకాంక్షించారు. పవన్ అధికారంలోకి రావాలంటే కాపులంతా సమైక్యంగా మెలగాలని కోరారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పవన్ ప్రాధాన్యమివ్వాలని హరిరామ జోగయ్య(Hari Rama Jogaiah) సూచించారు. జగన్ ఓటమి కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జనం మెచ్చేలా టీడీపీ, జనసేన మేనిఫెస్టో ఉండాలన్నారు. కాగా, మొదటి దశలో భాగంగా జూన్ 14న ఉభయగోదావరి జిల్లాలో ప్రారంభం అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra) నేటి(జూన్ 30)తో ముగియనుంది. ఈ యాత్ర ప్రతిరోజూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తూ వచ్చింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలో వారాహి యాత్ర కారణంగా జనసేనకు మైలేజ్ పెరిగిందని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. మొదటి దశ యాత్ర ముగింపు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు జనసేన బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also:
1. ‘చంద్రబాబు ప్రతిసారీ ఎలా గెలుస్తున్నాడో అర్ధం కావడం లేదు’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat