తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్నపానీయాలు ఎప్పటికప్పుడూ అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది ఏర్పాట్లుచేశారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 74,995 మంది దర్శించుకోగా.. 38,663 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్చించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.60కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
- Advertisement -
Read Also:
1. తిరుమల ఘాట్ రోడ్డులో బస్తు బోల్తా.. పలువురికి గాయాలు
2. వెదర్ అలర్ట్: ఏపీలో ఈ జిల్లాల్లో చెట్ల కింద ఉండకండని హెచ్చరిక
Follow us on: Google News, Koo, Twitter