Pawan Kalyan | పవన్‌ కల్యాణ్ మలికిపురం సభలో ఆసక్తికర సీన్‌

-

ఏపీ కాపు నేత ముద్రగడ పద్మనాభం వర్సెస్ జనసేన మధ్య వైరం రోజురోజుకూ వైరం పెరుగుతోంది. ప్రస్తుతం ముద్రగడ యాక్టీవ్ రాజకీయాల్లో లేరు. ఆయన సడెన్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మీద విమర్శలు చేయడం ద్వారా సంచలనం సృష్టించారు. అయితే ముద్రగడ(Mudragada Padmanabham) వెనక వైసీపీ ఉందని జనసేన నేతలు అంటున్నారు. జనసేనకు మద్దతుగా ఉనన్ జై కాపు సంక్షేమ సేన నాయకుడు మాజీ మంత్రి హరి రామజోగయ్య(Hari Rama Jogaiah) అయితే ముద్రగడ రాసేవన్నీ వైసీపీ లేఖలే అని డిక్లేర్ చేశారు. ఈ తరుణంలో ముద్రగడపై జనసైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. మలికిపురం బహిరంగ సభలో పవన్ సైతం పరోక్షంగా ముద్రగడపై విమర్శలు చేశారు. పెద్దల్ని గౌరవిద్దాం అంటూనే సెటైరికల్‌ టచ్‌ ఇచ్చారు. అంతేగాక, మలికిపురం సభలో కులద్రోహి అంటూ ముద్రగడకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించడంతో పవన్‌ రియాక్టయ్యారు. వెంటనే ఆ బ్యానర్లను తీసేయాలని సూచించారు. పెద్దలేదో అంటుంటారు!, మనం తీసుకోవాలి అంతే!, ఇలాంటివి మాత్రం వద్దన్నారు! దాంతో, ముద్రగడకు వ్యతిరేకంగా పెట్టిన ప్లకార్డులు, బ్యానర్లను కార్యకర్తలు తీసేశారు. అనంతరం ఎప్పటిలాగే జగన్‌ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిప్పులు చెరిగారు.

- Advertisement -
Read Also:
1. ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు
2. తెలంగాణలో గెలిచేది ఆ పార్టీనే.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...