నారా లోకేష్‌కు స్వాగతం పలికిన జన సైనికులు

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూర(Yemmiganur)లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా భారీగా జనసైనికులు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడతూ.. తనను అడ్డుకోవడం వైసీపీ(YCP) సర్కార్ వల్ల కాదు, జగన్(YS Jagan) వల్ల కూడా కాదని అన్నారు. చంచల్ గూడ జైలును జగన్ జైలుగా మార్చే కొత్త జీవోను జగన్ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. జగన్‌ను మించిన మోసగాడు ఏపీలోనే లేడని విమర్శించారు. ఎన్నికల ముందు ఢిల్లీ మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ ఆ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమన్నారు. వీరంతా కేసుల నుంచి బయట పడడం కోసమే పాకులాడుతున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఎప్పుడు ప్రారంభిస్తారని, ఖాళీగా ఉన్న రెండు లక్షలపై చిలుకు ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో జగన్ చెప్పాలని లోకేష్(Nara Lokesh)  డిమాండ్ చేశారు.

- Advertisement -
Read Also: నేను నేరస్థుడిని కాదు.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: MP

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...