మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

-

ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) పిలుపునిచ్చిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆయన ఆందోళనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఇంటివద్దే అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులను మెహరించారు. జేసికి మద్దతుగా వచ్చిన టీడీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేయడంతో అర్ధరాత్రి వరకు రోడ్డు మీద డివైడర్లపై పడుకుని నిరసన వ్యక్తంచేశారు.

- Advertisement -

అనంతరం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి తీసుకెళ్లారు. అయినప్పటికీ.. జేసీ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయాన్నే జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy) తాడిపత్రి మున్సిపల్‌ ఆఫీసుకు వచ్చారు. ఆఫీసు ఆవరణలోనే బ్రష్ చేసి, స్నానం చేశారు. దీంతో మున్సిపల్‌ ఆఫీసుకు వస్తానన్న పంతాన్ని జేసీ నెగ్గించుకున్నారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న హైడ్రామా రాత్రి డివైడర్లపై పడుకుని నిరసన తెలిపే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Read Also: రాయల తెలంగాణ డిమాండ్‌ను ఖండిస్తున్నా: బైరెడ్డి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...