Kanna Lakshminarayana: బీజేపీకి రాజీనామా చేసిన ‘కన్నా’కు చంద్రబాబు హామీ!

-

Kanna Lakshminarayana Likely to join TDP: బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. తన ముఖ్య అనుచరులతో సమావేశమైన కన్నా.. తాను బీజేపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. కొద్ది రోజులుగా బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన మనస్థాపంతో ఉన్న ఆయన.. ఆ పార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ప్రత్యామ్నాయ పార్టీలుగా ఉన్న జనసేన, టీడీపీలో దేనిలో చేరనున్నారనేది దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో కన్నా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని ఏపీ వ్యాప్తంగా వార్తలు విస్తృతమయ్యాయి. ఇప్పటికే టీడీపీ నేతలు కొందరు కన్నాతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి. వాస్తవానికి జనసేనలో చేరాలని అనుకున్న ఆయనకు టీడీపీ సత్తెనపల్లి స్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి దీనికి సంబంధించి స్పష్టమైన హామీ ఇప్పటికే తీసుకున్నారని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సిఉంది.

- Advertisement -
Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...