ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుంది: Pawan Kalyan

-

Janasena President Pawan Kalyan Responds Over Vizag King George Hospital Incident: వైజాగ్ కింగ్ జార్జ్ ఆసుపత్రి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందిన నవజాత శిశువును స్వస్థలానికి చేర్చేందుకు అంబులెన్స్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడంతో.. ఆ బిడ్డ తల్లితండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకువెళ్లడం తీవ్ర ఆవేదన కలిగించిందంటూ పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుంది. కానీ, ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు.

- Advertisement -

కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో దీనిని బట్టి అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి అంటూ పవన్(Pawan Kalyan) గురువారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...