మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

-

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరో లాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారని ప్రశంసించారు. బీజేపీకి 400 సీట్లు సాధించడానికి అవసరమైతే ప్రాణ త్యాగాలను చేస్తామంటూ పవన్ కల్యాణ్ చెప్పడాన్ని రాజేష్ తీవ్రంగా తప్పుపట్టారు.

- Advertisement -

‘పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం.. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది.. వీళ్ళిద్దరి కన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్.. కులం మతం పేరుతో అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే వారికీ వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు.. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్ధాలు ప్రజలకు తెలియజేస్తాం.. ఇప్పటికే చాలా సహించాం.. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం.. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం.. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్లం.. పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనపుడు మేము కూడా నిలకడగా ఉండలేము’అంటూ స్పష్టంచేశారు.

కాగా 2019 ఎన్నికల్లో మహాసేన రాజేష్(Mahasena Rajesh) వైసీపీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేశారు. అయితే ఫలితాల అనంతరం జగన్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ వీడియోలు చేశారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ గెలుపు కోసం రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేశారు. దీంతో రాజేష్‌కు పి.గన్నవరం సీటిచ్చారు చంద్రబాబు. అయితే గతంలో హిందూవులకు వ్యతిరేకంగా చేసి వీడియోలు వైరల్ అవడంతో తీవ్ర నిరసనలు జరిగాయి. దీంతో ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించారు. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజేష్.. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ఓడించండమే తన లక్ష్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేయండ సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read Also: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...