Heat Wave |ఏపీలో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఉగ్రరూపం చెరుగుతున్నాడు. దీంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు 135, రేపు 276 మండలాల్లో వడగాల్పులు, తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
Heat Wave |విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. భారీగా పెరగనున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్నాడు జిల్లా రావిపాడులో శనివారం అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా పెరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పెదమేరంగిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.