విజయవాడ డ్రైనేజీలో గల్లంతైన బాలుడి కథ విషాదంతం

-

విజయవాడ(Vijayawada)లోని ఓ డ్రైనేజీలో పడి గల్లంతైన బాలుడి కథ విషాదంతంగా ముగిసింది. గురునానక్ కాలనీకి చెందిన అభిరామ్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఓపెన్ డ్రైనేజీలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డిజాస్టర్ రెస్క్యూ సిబ్బంది బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. రెండున్నర కిలోమీటర్ల అనంతరం ఆయుష్ ఆసుపత్రి సమీపంలో బాలుడి మృతదేహం గుర్తించారు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మరణవార్త తెలుసుకున్న తండ్రి స్పృహ తప్పి పడిపోయాడు. అభిరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా ఉదయం నుంచి విజయవాడలో భారీ వర్షం కురవడంతో కాల్వలన్ని పొంగి పొర్లుతున్నాయి. వర్షం కాస్త తగ్గడంతో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అభిరామ్ మురుగుకాల్వలో పడిపోయాడు.

- Advertisement -
Read Also: తన చితిని తానే పేర్చుకొని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nalgonda | ఎస్సై రాసలీలలు.. చావుకి అనుమతి ఇవ్వలంటున్న భార్య

నల్గొండ(Nalgonda) జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సై మహేందర్ భార్య వినూత్న నిరసన...

Tirupati | న్యూ ఇయర్ వేళ తిరుపతిలో ఆంక్షలు

Tirupati | తెలుగు రాష్ట్రాలు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం...