తెలుగు దేశం పార్టీ నేతలపై జనసేన అసమ్మతి ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్(MLA Rapaka Vara Prasada) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అడిగినట్లు రాపాక స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని, కానీ తాను అలా చేయలేదని తెలిపారు. రాజోలులో ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన తన మిత్రుడు ఏఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడారని తెలిపారు. పార్టీలో నీతినిజాయితీలతో నేతలు, కార్యకర్తలు పనిచేయాలి అని వెల్లడించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడాలనుకుంటే తాను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.10కోట్లు వచ్చేది అని చెప్పానని ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుందని ఎమ్మెల్యే రాపాక(MLA Rapaka Vara Prasada) స్పష్టం చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేయను ఇక ఈ అంశంపై మాట్లాడొద్దని ఎమ్మెల్యే మంతెన రామరాజుకు చెప్పినట్లు రాపాక గుర్తు చేశారు.
Read Also: కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)
Follow us on: Google News, Koo, Twitter