టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్రం దిగ్విజయంగా సాగుతోంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర నేటితో 200 రోజులు పూర్తిచేసుకుంది. రోజుకు సగటున 13.5 కిలోమీటర్లు నడుస్తున్న లోకేష్ ఇప్పటివరకు మొత్తం 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్లు నడిచారు. 185 మున్సిపాలిటీలు.. మండలాలు, 1675 గ్రామాల మీదుగా యువగళం పాదయాత్ర సాగింది. ఇప్పటిదాకా 64 బహిరంగ సభల్లో పాల్గొన్న లోకేష్.. 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సమావేశాలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన పాదయాత్ర(Yuvagalam) హైలైట్‌గా నిలిచింది. తెల్లవారుజామున 3.30 గంటల వరకు పాదయాత్ర కొనసాగింది. ఆ సమయంలో కూడా లోకేష్‌ను చూడటానికి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఇక జులై 27న ఒంగోలులో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఫిబ్రవరి 2న తిరుపతిలో యువతతో నిర్వహించిన హలో లోకేశ్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన యువతీయువకులు భారీగా తరలివచ్చారు.ఏప్రిల్ 8న అనంతపురం జిల్లా శింగనమలలో నిర్వహించిన రైతన్నతో లోకేశ్(Nara Lokesh) కార్యక్రమానికి భారీగా రైతులు విచ్చేశారు.
జిల్లాల వారీగా లోకేష్ ఎన్ని కిలోమీటర్లు నడిచారంటే..
1. చిత్తూరు- 14 నియోజకవర్గాల్లో 577 కిలోమీటర్లు- 45 రోజులు
2. అనంతపురం- 9 నియోజకవర్గాల్లో 303 కిలోమీటర్లు- 23 రోజులు
3. కర్నూలు- 14 నియోజకవర్గాల్లో 507 కిలోమీటర్లు- 40 రోజులు
4. కడప- 7 నియోజకవర్గాల్లో 200 కిలోమీటర్లు- 16 రోజులు
5. నెల్లూరు- 10 నియోజకవర్గాల్లో 459 కిలోమీటర్లు- 31 రోజులు
6. ప్రకాశం- 8 నియోజకవర్గాల్లో 220 కిలోమీటర్లు- 17 రోజులు
7. గుంటూరు- 7 నియోజకవర్గాల్లో 236 కిలోమీటర్లు- 16 రోజులు
8. కృష్ణా జిల్లా- 6 నియోజకవర్గాల్లో 113 కిలోమీటర్లు- 8 రోజులు
9. పశ్చిమ గోదావరి జిల్లా- 2 నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు పాదయాత్ర