వైసీపీ సర్కార్, సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్, గ్యాస్, నిత్యవసరాల ధరలు విపరీతంగా పెంచి.. సామాన్య ప్రజలను హింసించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే పన్నుల భారం తగ్గిస్తామన్నారు. అలాగే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.28,147 కోట్ల సబ్ప్లాన్ నిధులు దారిమళ్లించారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ(TDP) అధికారంలోకి రాగానే అన్ని పథకాలను కొనసాగిస్తామన్నారు.
Read Also:
1. గద్దర్ సంచలన నిర్ణయం.. ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్!
2. మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో భారీ మార్పులు!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat