Nara Lokesh | మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?.. లోకేష్ తీవ్ర ఆగ్రహం..

-

మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? అంటూ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్‌(Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దళిత మహిళను వైసీపీ నేతలు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారనే ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

- Advertisement -

‘‘ట్యాంకర్‌ వద్దకు వచ్చిన సామినిబాయిని వైసీపీ సైకో చంపేశాడు. ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీయడం కలచివేసింది. నీటి కోసం వచ్చిన మహిళను టీడీపీకి చెందిన వ్యక్తివంటూ బెదిరించారు. నీటితో పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమా? ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. మనం ఉన్నది రాతియుగంలోనా అనే అనుమానం కలుగుతోంది. ఊరంతా చూస్తుండగానే మూడు సార్లు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. కావాలని చేసినప్పటికీ.. డ్రైవింగ్‌ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ఠ కాదా?’’ అని లోకేశ్‌(Nara Lokesh) మండిపడ్డారు.

మరోవైపు ఇదే ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు. “తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సామినిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన కలచివేసింది. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లనే పేరుతో అడ్డుకుంటారా? నీళ్లు లేవని ప్రాధేయపడినా.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి? ఘటనపై అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపట్టాలి. వైసీపీ వాళ్లే నీరు తాగాలి.. వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి అనే రీతిలో భవిష్యత్తులో జీవో ఇస్తారేమో.. పంచభూతాలకు సైతం పార్టీ రంగులు పులిమే దుర్మార్గపు పాలన ఏపీలో రాజ్యమేలుతోంది. ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. అంటారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ.. నా ఎస్సీ.. అనే అర్హత ఉందా?’’ అని పవన్(Pawan Kalyan) నిలదీశారు.

కాగా రెంటచింతల మండలం మల్లవరంలో నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్ దగ్గరకు వెళ్లిన ఓ దళిత మహిళను ట్రాక్టర్‌తో ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మాచర్ల ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Read Also: వైసీపీకి మరో ఎదురు దెబ్బ.. టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...