Yuvagalam Navasakam | నేడే యువగళం ముగింపు సభ.. ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్

-

Yuvagalam Navasakam |టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించనున్న’యువగళం-నవశకం’ ముగింపు బహిరంగ సభ నేడు జరగనుంది. విజయనగరం( Vizianagaram) జిల్లా పోలిపల్లి వద్ద జరిగే ఈ సభకు టీడీపీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ దశాబ్దంలోనే కనివీని ఎరుగని రీతిలో సభను నిర్వహించనున్నారు. దాదాపు 5లక్షల మంది హాజరుకానున్నట్లు భావిస్తున్నారు.

- Advertisement -

110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ(Yuvagalam Navasakam) జరగనుంది. 8 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 100 అడుగల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో సభ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత థోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna)తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సభా వేదికగా ఉమ్మడి మేనిఫెస్టో, కార్యాచరణను ప్రకటించనున్నారు.

Read Also: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ.. మాజీ డీజీపీకి షాక్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...