Kesineni Nani | కేశినేనికి చెక్ పెట్టిన చంద్రబాబు.. నాని సంచలన ప్రకటన

-

విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ వేరే అభ్యర్థికి పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వనున్నారని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

 

- Advertisement -
“అందరికీ నమస్కారం.. నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ నన్ను కలసి.. 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్‌చార్జ్ గా చంద్రబాబు నియమించారని, కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు నాకు చెప్పమన్నారని తెలియచేశారు. అలాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని నాకు తెలియచేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను”’ అని చెప్పారు.

 

దీంతో నాని(Kesineni Nani) ప్రకటన విజయవాడ టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే కొంతకాలంగా నాని, సోదరుడు కేశినేని చిన్ని మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయి. ఇటీవల తిరువూరు సభలో కూడా ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం నానికి చెక్ పెట్టాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.

 

Read Also: కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కొడాలి నాని ఏమన్నారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...