ఇక టీడీపీని ఎవరూ ఆపలేరు.. గేర్‌ మార్చి స్పీడ్‌ పెంచుతాం: చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం శ్రేణులు జోష్ నింపారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలకే జగన్‌పై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చిందని.. దాని ఫలితమే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని వ్యాఖ్యానించారు. ‘ఇక నుంచి తెలుగుదేశం పార్టీ అన్‌స్టాపబుల్‌. గేర్‌ మార్చి.. స్పీడ్‌ పెంచుతాం. సైకిల్‌‌పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం. జగన్ చేసిన విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అప్పులు చేయడం.. దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జగన్‌ది ధన బలమైతే.. మనది జన బలం. పేదలను దోచుకున్న జగన్(Jagan).. పేదల ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తి కంటే.. జగన్ ఆస్తి ఎక్కువ’ అని చంద్రబాబు(Chandrababu) ఆరోపించారు.

- Advertisement -
Read Also: వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

Follow us on: Google News  Koo  Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....