Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

-

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneswari) నామినేషన్ వేశారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి నామినేషన్ వేశారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి, విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్లు వేశారు.

- Advertisement -

భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌, నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గుడూరి ఎరిక్షన్ బాబు, కొండేపి టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజేయస్వామి, కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్టారెడ్డి కూడా నామినేషన్ వేశారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్‌ తరఫున ఆయన భార్య అనురాధ నామినేషన్లు సమర్పించారు.

నగరి అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థి మంత్రి రోజా సెల్వమణి, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ నామినేషన్లు దాఖలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా లావణ్య, తాడికొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి శ్రావణ్‌ కుమార్, పాలకొల్లు నుంచి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు నామినేషన్లు వేశారు.

తెలంగాణలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) నామినేషన్ దాఖలు చేశారు. భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీపీఐ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ నామినేషన్లు(Nominations) సమర్పించారు.

Read Also: బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MLC Kavitha | ప్రభుత్వ విద్యార్థులను పట్టించుకోవాలి.. కవిత డిమాండ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు....

MLC Jayamangala | వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా..

వైసీపీ(YCP)లో రాజీనామాల పర్వానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. ఒకరి తర్వాత...