సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ – జనసేన(TDP – Janasena) పార్టీల మధ్య స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల అధినేతల మధ్య జరిగిన సమావేశంలో టికెట్ల అంశం కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు(Chandrababu) నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 3గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది.
TDP – Janasena | రాజోలు, రాజానగరం స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందని రిపబ్లిక్ డే రోజు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన ఇద్దరు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై వేరువేరుగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు.