Pawan visakha tour effect ap police department suspends Acp Mohan Rao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటనలో ఏసీపీ మోహన్‌రావు పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీస్ శాఖ మోహన్‌రావు పై వేటు వేసింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆయనను సస్పెండ్ చేస్తూ..ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబరు 15న అధికార వైసీపీ విశాఖగర్జన సభ నిర్వహించగా.. అదే సమయంలో జనవాణి పేరిట పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో కార్యక్రమం నిర్వహించారు. కాగా.. అధికార ప్రభుత్వ రాష్ట్ర మంత్రులు, రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నుంచి తిరుగు ప్రయాణానికి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం జరిగింది. అయితే.. అదే సమయంలో విశాఖ వస్తున్న పవన్‌కు స్వాగతం పలకడానికి భారీగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే…