రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఈయన గురించి బాగా తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున తన ఐప్యాక్ సంస్థ ద్వారా వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీ సాధించడంలో వ్యూహాలను రూపొందించారు. దీంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కొంతకాలంగా ఆయన ఐప్యాక్ సంస్థకు దూరంగా ఉంటున్నారు. జన్ సురాజ్ పార్టీ పెట్టి బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో గత డిసెంబర్‌లో లోకేశ్(Nara Lokesh)తో కలిసి చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన టీడీపీ కోసం పనిచేస్తున్నారనే చర్చ జోరుగా జరిగింది. తాజాగా చంద్రబాబుతో భేటీ కావడంపై పీకే ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రాజకీయంగా సలహాలను ఇవ్వడానికి చంద్రబాబును కలవలేదని స్పష్టంచేశారు. చంద్రబాబు(Chandrababu)కు, తనకు సన్నిహితంగా ఉండే ఓ రాజకీయ ప్రముఖుడు ద్వారా ఆయననను కలవాల్సి వచ్చిందని తెలిపారు. చంద్రబాబును ఒకసారైనా కలవాలని ఆ రాజకీయ నాయకుడు తనపై ఒత్తిడి తీసుకురావడంతో విజయవాడ(Vijayawada)కు వెళ్లానన్నారు.
2019 ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని.. ఆ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. ఈసారి ఎవరికి పనిచేయడం లేదని చంద్రబాబుకు చెప్పినట్లు వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో తాను జోక్యం చేసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బిహార్ రాజకీయాల మీదే పూర్తిగాదృష్టి పెట్టానని పేర్కొన్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్(Prashant Kishor).. టీడీపీ, వైసీపీ తరపున పనిచేయడం లేదనే స్పష్టత వచ్చింది.
చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు, నేను చేయను అని చెప్పాను – #PrashantKishor
దీనికి పచ్చ మీడియా అల్లిన కథలు
ఇచ్చిన బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బ …. pic.twitter.com/chshlt6REG— Actual India (@ActualIndia) January 23, 2024