వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. ఈసారి ఎవరంటే..?

-

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు(Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని పేర్కొన్నారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎంపీ సీటు బీసీలకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందన్నారు. కాగా త్వరలోనే ఆయన(Lavu Srikrishna Devarayalu) టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కాగా ఇటీవల మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను కలిసిన ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Read Also: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయంగా షర్మిల జిల్లాల పర్యటన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...