మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని ఎద్దేవా చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచి కప్పు కొడుతుందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో జూదం అనేది లేదని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని కానీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయని ఆరోపించారు. చిలకలూరిపేట(Chilakaluripet) నియోజకవర్గంలోని అపార్టుమెంట్లలో, బజార్లలో పేకాట నడుస్తోందని.. మంత్రి విడదల రజని(Vidadala Rajini) సహకారంతోనే యథేచ్ఛగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ క్లబ్‌ల ద్వారా రజిని రూ.కోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. సీఎం నివాసానికి సమీపంలో ఉన్న చిలకలూరిపేటలో జరిగే అరాచకం జగన్ కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పేకాటతో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని పుల్లారావు(Prathipati Pulla Rao) ఆవేదన వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీనే నెంబర్ వన్: ప్రత్తిపాటి
-