Natti Kumar | సీఎం జగన్‌పై నిర్మాత నట్టికుమార్ తీవ్ర విమర్శలు

-

సినీ నిర్మాత నట్టికుమార్(Natti Kumar) సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్(Jagan) రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు విశాఖ భూములు కబ్జా చేస్తున్నారని.. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ.2వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను ఆక్రమించుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖకు కోట్లాది రూపాయల విలువైన పరిశ్రమలు వచ్చినట్టు మంత్రి అమర్‌నాథ్(Gudivada Amarnath) చెబుతున్నారని అసలు ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

అలాగే తాను త్వరలోనే చంద్రబాబును కలిసి టీడీపీ(TDP)లో చేరనున్నట్లు స్పష్టంచేశారు. జగన్ పాలన మొత్తం రెడ్ల రాజ్యమే నడుస్తుందని ఆరోపించారు. తొలుత తాను వైసీపీ సానుభూతిపరుడినేనని అయితే జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలతో విసిగిపోయానని తెలిపారు. గత ఎన్నికల్లో తమ లాంటి వాళ్లను తన స్వార్థానికి ఉపయోగించుకున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP)-జనసేన(Janasena)కి 130 నుంచి 150 సీట్లు వస్తాయని, వైసీపీ 29సీట్లకు పరిమితం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

తాను(Natti Kumar) కూడా త్వరలోనే వైసీపీ(YCP)కి వ్యతిరేకంగా ఓ సినిమా తీస్తానని.. ఇందులో బాబాయ్ వివేకానందరెడ్డి(Vivekananda Reddy) మర్డర్, ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju)పై చిత్ర హింసలు, వైసీపీ అరాచకాలు వంటివి చూపిస్తానని చెప్పుకొచ్చారు. త్వరలోనే సినీ ఇండస్ట్రీ మొత్తం టీడీపీకి మద్దతుగా ఉంటుందన్నారు.

Read Also: షర్మిల వెంటే నా ప్రయాణం.. తేల్చి చెప్పిన ఆర్కే

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...