ఎన్నికల సమయంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం(Koneti Adimulam) తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)తో సమావేశం అయ్యారు. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని సమాచారం.
సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని ప్రకటించి.. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఆదిమూలం(Koneti Adimulam)ను సీఎం జగన్ నియమించారు. అయితే తిరుపతి ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడని ఆదిమూలం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు టికెట్ దక్కకుండా పెద్దిరెడ్డి(Peddireddy) కుట్ర చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కేవలం దళిత సీట్లనే మారుస్తున్నారని.. కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, రోజా వంటి ఎమ్మెల్యేల సీట్లను మార్చగలరా? అని ప్రశ్నించారు.