ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని తెలిపింది. 2022లో ఈ కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని గుర్తు చేసింది. అలాగే చంద్రబాబు(Chandrababu)కు నోటీసులు ఇవ్వడానికి కూడా అభ్యంతరం తెలిపింది. దీంతో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది.
కాగా ఈనెల 10న సీఐడీ అధికారులు దాఖలు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.