మరోసారి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలంతా తెలంగాణకు వలస వెళ్లా్ల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో కరెంట్ బిల్లు రేట్లు పెరిగాయో? వైసీపీ హయాంలో పేరిగాయో? చర్చకు సిద్ధమా అంటూ జగన్ కి అచ్చెన్నాయుడు(Atchannaidu) సవాల్ విసిరారు. తాను నిరూపిస్తానని.. నిరూపించలేకపౌతే రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయంటే సొంత ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అదే తాను ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేశావాడినని తెలిపారు. జగన్(Jagan) అవినీతి పరుడని, పంచ భూతాలను దోచుకున్నాడని విమర్శించారు. జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జగన్‌ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు.
Atchannaidu | ‘2019లో జగన్‌ను గెలిపించటం ప్రజలు చేసిన తప్పే’
-