యర్రగొండపాలెంలో రాళ్ల దాడి ఘటనపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు!

-

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం(Yerragondapalem)లో శుక్రవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా జరిగిన రాళ్ల దాడిని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన రాళ్ల దాడి, తదిరత నిరసన ఘటనలను గవర్నర్ దృష్టికి వెళ్లనుంది. ఇప్పటికే దాడి ఘటన వివరాలను ఈమెయిల్ ద్వారా రాజ్ భవన్ పంపిన నేతలు.. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలను ప్రస్తావించనున్నారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉన్న చంద్రబాబుపై గతేడాది నవంబర్ లోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. రాళ్లదాడిలో భద్రతాధికారి తలకు కూడా గాయాలు కావడంతో ఈ ఘటనను టీడీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు.

- Advertisement -

మరోవైపు చంద్రబాబు(Chandrababu)పై జరిగిన రాళ్ల దాడిని టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మంత్రి సురేష్(Audimulapu Suresh) ఓ రౌడీ లాగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇలాంటి దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని.. అధికారమదంతో ఎగిరెగిరి పడుతున్న వైసీపీ నేతలకు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

Read Also: ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ అంటున్న టైమ్స్ నౌ సర్వే

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...