టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి(Chandrababu)కి జగన్ ఇలాఖాలో ఊహించని షాక్ తగిలింది. వైసీపీ(YCP) దళిత నేతలు చంద్రబాబుకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల జండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో దళిత నేతలు పులి సునీల్ కుమార్, వినోద్ కుమార్ ల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
నారా లోకేష్ దళితుల్ని కించపరిచేలా మాట్లాడారని, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. విదేశీ విద్య వల్ల దళితులు పీకిందేమి లేదు చేసిందేమీ లేదని లోకేష్(Nara Lokesh) వ్యాఖ్యానించారని, గతంలో చంద్రబాబు కూడా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు(Chandrababu) జిల్లాకు రావాలని హెచ్చరించారు. కాగా దళిత నేతల నిరసనని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకి, నేతలకి మధ్య తోపులాట జరిగింది.
Read Also: బాలీవుడ్ బెటర్.. మరోసారి సౌత్ పై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter