భ్రష్టుపట్టిన ఎక్సైజ్ పాలసీ.. గీత కార్మికులకు రిజిస్ట్రేషన్

-

గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని భ్రష్టుపట్టించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో దారుణాలకు పాల్పడిందని ఆయన అన్నారు. ‘‘సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారు. వారి సొంత బ్రాండులైన జె బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో మద్యపాన నిషేధం అంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత దశల వారీగా మద్యం నియంత్రణ అంటూ మోసం చేశారు. సామాన్యుడు అప్పులు తెచ్చి, పుస్తులు అమ్మి మందు తాగే దుస్థితి తీసుకొచ్చారు. దీంతో మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వారి జేబుల్లోకి వెళ్లిపోయింది. డిప్యుటేషన్ మీద అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. వారి విధానంతో మల్టీ నేషనల్ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. నాసిరకం మద్యం తాగి చాలామంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారు. కిడ్నీ సమస్యలు, పెరాలసిస్ వంటి సమస్యలతో మంచానపడ్డారు. డిస్టలరీస్ వ్యవస్థను కూడా వారి చేతుల్లోకి తీసేసుకున్నారు. గత ఐదేళ్లలో వారి అక్రమ మద్య విధానంపై ఎన్నో పోరాటాలు చేశాం. దాదాపు రూ.19 వేల కోట్ల నిధులు దారి మళ్లించారు. చాలామంది నాటుసారా, నాట్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడ్డారు’’ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై సీఎం ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేయడం జరిగింది. అప్పట్లో 1994లో అమలు చేసిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దానిని ఆదర్శంగా తీసుకుని 6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశాం. అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ మద్యం షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నడుపుతున్న మద్యం షాపుల విధానాలను అధ్యయనం చేశారు. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందించేలా ప్రపోజల్స్ ను రేపు కేబినెట్ ముందు ఉంచుతాం. డ్రగ్స్, వంటివాటిని నియంత్రించేలా, మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులు కేటాయించనున్నారు. 5-6 పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం విక్రయాలను నిలిపివేశాం. గత ప్రభుత్వ పాలసీపై జరుగుతున్న విచారణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదు. గత ప్రభుత్వంలో డిస్టలిరీస్ ను కూడా కబ్జా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10 రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుంది. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుంది. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ అలాగే జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది’’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...