మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) మళ్లీ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ(CBI).. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే తన తల్లి గుండెపోటు(Heart Attack)కు గురి కావడంతో పులివెందులోని గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్పించారని.. విచారణకు హాజరుకాలేనని చెబుతూ సీబీఐకి లేఖ రాశారు. అనంతరం విచారణకు వెళ్లకుండా హుటాహుటిన హైదరాబాద్ నుండి పులివెందుల బయలుదేరారు.
అయితే ఈ నెల 16వ తేదీన కూడా విచారణకు రావాలంటూ సీబీఐ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy)కి నోటీసులు ఇచ్చింది. కానీ ముందస్తు కార్యక్రమాలు ఆ రోజు విచారణకు హాజరు కాలేదు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీబీఐ నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా అవినాశ్ రెడ్డి ఇవాళ కూడా సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో సీబీఐ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read Also: 18నెలలైనా సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్
Follow us on: Google News, Koo, Twitter