9 Guarantees | మహిళలకు ప్రతి నెలా రూ.8500.. ఏపీ కాంగ్రెస్ కీలక హామీలు

-

అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను(9 Guarantees) అమలు చేస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం 9 గ్యారెంటీ హామీల కరపత్రం, డోర్ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు.

- Advertisement -

Congress 9 Guarantees : 

మొదటి గ్యారెంటీ: రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా

రెండవ గ్యారెంటీ: ప్రతి పేద మహిళకు ప్రతి నెలా రూ.8500

మూడవ గ్యారెంటీ: రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ

నాలుగవ గ్యారెంటీ: పెట్టుబడి మీద 50 శాతం లాభం తో కొత్త మద్దతు ధర

ఐదవ గ్యారెంటీ: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం 400 రూపాయలు

ఆరవ గ్యారెంటీ: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య

ఏడవ గ్యారెంటీ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ.. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీదే

ఎనిమిదవ గ్యారెంటీ: ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద రూ.5లక్షలతో పక్కా ఇళ్లు

తొమ్మిదవ గ్యారెంటీ: అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4వేల పెన్షన్, వికలాంగులకు రూ.6వేల పెన్షన్

Read Also: మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేనాని
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు....

SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. ఎనిమిది మంది గల్లంతు

శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది....