మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతరు సునీతారెడ్డి(Sunitha Reddy) టీడీపీలో చేరుతున్నట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. రాజకీయ రంగప్రశేశం చేస్తున్న సునీతమ్మకు స్వాగతం అంటూ ప్రొద్దూటూరులోని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కనిపించాయి. ఆ పోస్టర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, బీటెక్ రవి(Btech Ravi)తో పాటూ వైఎస్ వివేకా ఫోటో కూడా ఉండడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తన తండ్రి వివేకా హత్య కేసు(Viveka Murder Case) నిందితులను పట్టుకోవాలని ఆమె(Sunitha Reddy) కొంతకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సునీత టీడీపీ(TDP) నేతలతో టచ్ లో ఉన్నట్లు కొందరు వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు టీడీపీలో ఆమె చేరబోతున్నట్లు పోస్టర్లు అంటించడం కలకంల రేపుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఆ పోస్టర్లు తాము అంటించలేదని చెబుతున్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.
Read Also: హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter