క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Are you paying your credit card bill late? Be sure to find out these things!

0
114

ప్రస్తుత కాలంలో క్రెడిట్‌ కార్డుల వాడకం సాధారణం అయింది. గతంలో బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్‌ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్‌ ద్వారానా వివరాలు తెలుసుకుని ఆధార్‌ వివరాలతో కార్డును జారీ చేస్తున్నాయి బ్యాంకులు. కానీ క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవు. క్రెడిట్ కార్డు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కార్డు ఇచ్చిన తర్వాత కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు వాడితే బిల్లు చెల్లించే ముందు నానా తంటాలు పడాల్సిందే!.. క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించే వారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.

ముఖ్యంగా కార్డులోని డబ్బులు వాడిన తర్వాత చెల్లింపు గడువును గుర్తించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందులో పూర్తిగా చెల్లించకుండా సగం సగం చెల్లించినట్లయితే మీరు అప్పుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది. ఆ బిల్లు మొత్తంపై వడ్డీ విధిస్తాయి బ్యాంకులు. అలాగే మినిమమ్‌ బిల్లులు చెల్లించినా మీకు పెనాల్టీ విధిస్తుంటాయి.

బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో కస్టమర్‌కు 45-50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని ఇస్తారు. ఈ కాలంలో బకాయి మొత్తం అదనపు ఛార్జీ లేకుండా చెల్లించవచ్చు. కానీ ఆ సమయం దాటి బిల్లు చెల్లిస్తే మాత్రం 34 శాతం నుంచి 40 శాతం వరకు అధిక వడ్డీ రేటుతో చెల్లించుకోవాల్సి ఉంటుంది.

దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..ప్రస్తుతం కాలంలో క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. కార్డును వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సమయానికి బిల్లు చెల్లించని పక్షంలో పెనాల్టీల మోత మోగుతుందని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.