‘జియోఫోన్‌ నెక్ట్స్‌’ స్మార్ట్‌ఫోన్‌ వివరాలు లీక్‌..!

Geophone Nexts' smartphone details leaked ..!

0
94

తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో జియో టెలికాం సంస్థ గూగుల్‌తో కలిసి కొత్త మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘జియోఫోన్‌ నెక్ట్స్‌’ను తీసుకురానుంది. గత నెలలో వినాయకచవితి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారని భావించినప్పటికీ వివిధ కారణాలతో విడుదల వాయిదా పడింది.

దీంతో ఈ ఫోన్‌ను దీపావళికి మార్కెట్లోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్ల వివరాలు గూగుల్ ప్లే కన్సోల్‌ నుంచి లీక్ అయినట్లు అభిషేక్ యాదవ్‌ అనే టిప్‌స్టర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.

జియో నెక్ట్స్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత గో ఎడిషన్‌తో పని చేస్తుందట. ఇది లైట్‌ వెర్షన్ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది. 4జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుందట. 2 జీబీ ర్యామ్‌ ఉంటుందని సమాచారం. 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. కెమెరాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ ఫోన్‌కి రెండు వైపులా 13 ఎంపీ కెమెరా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ధర సుమారు రూ. 3,500 నుంచి రూ. 5,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.