దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
డిసెంబరు 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశముంది. ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతి నెల సమీక్షించి కొత్త ధరలు నిర్ణయిస్తాయి. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ రూ.20 లేదా రూ.30 మాత్రమే వస్తోంది. అయితే ఈ సబ్సిడీని రూ.312కి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింకు చేసిన వినియోగదారులకు గతంలో రూ.176 సబ్సిడీ అందేది. త్వరలో దీనిని రూ.312కి పెంచనున్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల కాలంలో రూ.వెయ్యికి చేరింది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఆధార్‌తో అనుసంధానించడానికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.