గూగుల్ క్రోమ్ యూజర్లకు షాకింగ్ న్యూస్..సంచలన విషయాలు వెల్లడించిన సాఫ్ట్ వెర్ సంస్థ మెకాఫీ

0
40

ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే మన అవసరాల కోసం ఫోన్ లు యాప్ లు వాడుతుంటాం. అందులో గూగుల్ క్రోమ్ ఒకటి. మనకు కావలసిన సమాచారాన్ని ఇందులో నుండి తీసుకుంటాం. అయితే తాజాగా గూగుల్ క్రోమ్ వాడే వారికి సాఫ్ట్వేర్ సంస్థ మెకాఫీ వార్నింగ్ ఇచ్చింది.

గూగుల్ క్రోమ్ లోని నెట్ఎక్స్ పార్టీ, నెట్క్లిఫ్లెక్స్ 2, ఫ్లిపాపే, ఫుల్పజ్ స్క్రీన్ షాట్ క్యాప్చర్, ఆటోబై ఫ్లాష్ సేల్స్ అనే 5 ఎక్స్టెన్షన్లు యూజర్ల డేటాను సేకరించి, డెవలపర్స్ కు పంపుతున్నాయని యాంటీ వైరస్ సాఫ్ట్ వెర్ సంస్థ మెకాఫీ వెల్లడించింది. కాబట్టి గూగుల్ క్రోమ్ వాడకం పట్ల యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అయితే గూగుల్ క్రోమ్ లోని 5 ఎక్స్టెన్షన్లు గూగుల్ వీటిని తొలగించిందని, యూజర్లు కూడా వెంటనే క్రోమ్ నుంచి డిలీట్ చేయాలని హెచ్చరించింది. కాగా బ్రౌజింగ్ ఎక్స్ట్రా ఫీచర్ల కోసం వీటిని వాడుతుంటారు. దీని వల్ల యూజర్ల డేటాకు ప్రైవసీ లేకుండా పోతుందని సాఫ్ట్ వెర్ సంస్థ మెకాఫీ వెల్లడించింది.