బ్రేక్​ ఫేల్యూర్​ అయ్యి బస్సు బోల్తా..ఆరుగురు దుర్మరణం

0
145

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఒడిశాలోని గంజామ్​-కంధమల్​ సరిహద్దు వద్ద కళింగ ఘటి ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. టూరిస్ట్​ బస్సు బోల్తా పడి ఆరుగురు మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా పరిసరప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడడంతో అందులో 14 మందిని బెర్హమ్​పుర్​లోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు.  మరో 16 మందిని భంజానగర్ ఆసుపత్రికి తరలించి వైద్యుల సమక్షంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దారింగ్​బడి నుంచి బంగాల్​కు ప్రయాణిస్తున్నక్రమంలో బస్సులో బ్రేక్​ ఫేల్యూర్​ అయ్యి ఈ ప్రమాదానికి దారితీసిందని పోలీసులు నిర్దారించారు.