కారును ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం

0
109

ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా..అతివేగం ఈ ప్రమాదానికి దారి తీసిందని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.

వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా ఈ ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు మృతిచెందిన వారిని కృష్ణయ్య,  శివలుగా గుర్తించి..క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.