వేలిముద్రలు మార్చి..విదేశాలకు పంపించి..ముఠా నయా దందా

0
101

కువైట్‌ బహిష్కృత కార్మికులతో ఓ ముఠా నయా దందాకు తెరలేపారు. ఏకంగా చేతిపై వేలిముద్రలు మార్చి.. విదేశాల్లో ఉద్యోగాలకు పంపేందుకు ఓ గ్యాంగ్​ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వేలిముద్రల శస్త్రచికిత్సలు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన నాగమునీశ్వర్‌రెడ్డి అని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.

శస్త్రచికిత్స చేసిన ఫింగర్‌ ప్రింట్‌ ఏడాది పాటు ఉంటుంది. నకిలీ ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా విదేశాలకు వెళ్లేందుకు ఇలా కుట్ర పన్నారు. ప్రధాన నిందితుడు వైఎస్‌ఆర్‌ జిల్లా వాసి నాగమునీశ్వర్‌రెడ్డి. శస్త్రచికిత్సకు సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీమహేశ్ భగవత్ అన్నారు. నాగమునీశ్వర్‌రెడ్డి తిరుపతిలో రేడియాలజీ కోర్సు చేశాడని సీపీ వివరించారు. వీసా గడువు పూర్తైన వారిని కువైట్‌ నుంచి వెనక్కి పంపుతున్నారని…అలా వచ్చినవారిలో కొందరు శ్రీలంక వెళ్లి.. ఫింగర్‌ ప్రింట్స్‌ సర్జరీకి పాల్పడినట్లు గుర్తించినట్లు భగవత్‌ చెప్పారు. శస్త్రచికిత్స చేసిన ఫింగర్‌ ప్రింట్‌ ఏడాది పాటు ఉంటుందని..నకిలీ ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు కుట్ర చేస్తున్నారని వివరించారు.

నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి..రిమాండ్‌కు తరలిస్తున్నామని భగవత్‌ స్పష్టం చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.నిందితుల్లో ఏపీకి చెందిన ఆర్ఎంపీలు ఉన్నారని తెలిపారు. ఉద్యోగం లేనివాళ్ల వేలిమద్రలు తీసుకొని యూఏఈ విదేశాంగ శాఖ అధికారులు స్వదేశానికి పంపిస్తున్నారు. మరోసారి దేశంలోకి వస్తే వేలిముద్రల ద్వారా విమానాశ్రయాల్లోనే గుర్తించి తిరిగి పంపించేస్తున్నారని సీపీ తెలిపారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకే ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని సీపీ వెల్లడించారు.