Palnadu |పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణ హత్య కలకలం రేపింది. సైదులు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో ముక్కలుగా నరికి చంపారు. అనంతరం ముక్కలుగా నరికిన శరీర భాగాలను తగలబెట్టారు. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పల్నాడులో సంచలనం… వ్యక్తిని ముక్కలుగా నరికి..
-