అంబర్ పేట్ లో భారీ అగ్ని ప్రమాదం..భయాందోళనలో ప్రజలు

Massive fire in Amber Pete..People in panic

0
96

హైదరాబాద్ అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిందా తిలిస్మాత్ రోడ్ గోల్నాక డివిజిన్ న్యూ గంగా నగర్ వేస్ట్ పేపర్ మిల్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో చుట్టూ ఉన్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా 3 సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. అంబర్ పేట్ నియోజకవర్గంలో ఇలాంటి కంపెనీలు నివాసల మధ్యలో ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గతంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత కిషన్ రెడ్డి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 4 గంటలు ఆయన ఘటన స్థలంలో ఉండి సామాన్య ప్రజలు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అయిన జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.