తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడ ముత్యాలబాగ్, ఆర్టీసీ గెస్ట్ హౌస్ సమీపంలో నివసిస్తున్న దంపతుల కుమార్తె డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా తమ కుమార్తె తల్లితండ్రులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టకపోవడంతో పాటు స్నేహితులతో కలసి జల్సాలు చేస్తుంది. అంతేకాకుండా చదువుపై కూడా శ్రద్ద పెట్టకపోవడంతో తల్లి చాలా సార్లు మందలించింది. కానీ తల్లి మాట లెక్కచేయకపోవడంతో ఎక్కడ ఆమె జీవితం అంధకార మయమవుతుందోనని తీవ్ర మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని మరణించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.