విజయవాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం.. ఒకరు మృతి

-

విజయవాడలో(Vijayawada) ఓ కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి వేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైకును బలంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లాకు చెందిన కారుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్‌ను అనుచరులు తొలగించారు. ఆ తర్వాత కారును అక్కడే వదిలేసి డ్రైవర్‌తో కలిసి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకుని గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...