‘గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్’..వైరల్ వీడియో

'QR code for gangsters' .. viral video

0
92

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిన తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ కూడా అధికమయ్యాయి. సూపర్‌ మార్కెట్‌ నుంచి కిల్లీ కొట్టు వరకు.ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నుంచి పానీపూరీ బండి వరకు ఈ మధ్య ఎక్కడ చూసినా గూగుల్‌ పే, ఫోన్‌ పే క్యూఆర్‌ కోడ్‌లే కన్పిస్తున్నాయి. నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్‌ రూపంలో భిక్షాటన చేస్తున్నట్లు అందులో ఉంది.

ఈ వీడియోలో గంగిరెద్దు తలపై క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను అమర్చగా..ఓ వ్యక్తి దాన్ని స్కాన్‌ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి భిక్ష పంపించాడు. ఈ వీడియోను నిర్మలా సీతారామన్‌ పోస్ట్‌ చేస్తూ.. ”గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో ఇది. ఇందులో వారు క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా భిక్ష తీసుకుంటున్నారు. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరింది.” అని రాసుకొచ్చారు.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://twitter.com/nsitharaman