Breaking: సంగారెడ్డి జిల్లాలోని ఐరన్‌ పరిశ్రమలో భారీ పేలుడు..

0
73
Kabul

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని ఐరన్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో హేమంత్‌ అనే యువకుడు మృతి చెందగా..మరో ముగ్గురి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.హేమంత్‌ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.